విశాఖకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ వెంకటేష్ రామభక్తి చాటుకున్నాడు. 5గంటలు శ్రమించి రెండు సెంటీమీటర్ల ఎత్తు, 1.2 సెంటీ మీటర్ల వెడల్పుతో పెన్సిల్ మొనపై హనుమంతుని ప్రతిమ చెక్కాడు. ఔరా అనిపించాడు.
కొన్ని నమూనాలు పంపానని, తనకు హనుమంతుని కళారూపం పంపాలని అయోధ్య నుంచి కబురు అందినట్టు వెంకటేష్ తెలిపాడు. సూక్ష్మ కళాఖండం అయోధ్యలో భాగం పంచుకుంటుండడం కంటే ఇంకా ఆనందం ఏముంటుందని ఈ మైక్రో ఆర్టిస్ట్ అంటున్నాడు.