అదనపు కట్నంగా స్కార్పియో కారు ఇవ్వలేదని ఓ భర్త కట్టుకున్న భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో అతడిపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 2015లో ముస్లిం కట్టుబాట్ల ప్రకారం తమకు వివాహమైందని, ఆ సమయంలో కట్నంగా రూ.15 లక్షలు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.