విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని సీపీఐ నేత రామకృష్ణ సందర్శించారు. అయన శనివారం మాట్లాడుతూ.. 'అంబేడ్కర్ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారు.
రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదు. జాతీయ స్థాయి కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారు. జగన్ దళితులను అన్ని విధాలా మోసం చేశారు' అని అన్నారు.