దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ‘అనుష్ఠాన్’ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన దేశంలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.
ఈ క్రమంలో తమిళనాడులోని తిరుచిరాపల్లికి మోదీ ఈరోజు చేరుకున్నారు. శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని ఏనుగు మోదీని ఆశీర్వదించింది. కాగా తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్రమోదీయే కావడం విశేషం.