మయన్మార్‌లో కొంతకాలంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య పోరు జరుగుతోంది. దాంతో మయన్మార్ ఆర్మీకి చెందిన వందలాదిమంది సిబ్బంది మిజోరం సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు.
ఈ పరిణామాలపై మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. వారిని తిరిగి వెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.