అయోధ్యలో బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు. ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవైన భారీ వేణువును పిలిభిత్(ఉత్తరప్రదేశ్) నుంచి అయోధ్యకు పంపించనున్నారు.
ఈ అరుదైన వెదరును అస్సాం నుండి 20ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. ప్రముఖ శిల్పకారుడు నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, కుమారుడు అర్మాన్ నబీ, వారి బంధువు దీన్ని 10 రోజుల్లో తయారు చేశారు. అయోధ్యలోని మ్యూజియంలో ఈ వేణువును ఉంచనున్నారు.