అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రముఠా జైషే మహ్మద్ బెదిరింపులకు పాల్పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ.. కల్లోల పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది.
దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి.