అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. ఈ క్రమంలో రాముడిని చూసేందుకు దేశంలోని ఆయా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
ఖాళీ చేతులతో రాకుండా ఏదో ఒక కానుకను తీసుకొస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 17 మంది భక్తులు శనివారం అయోధ్యకు చేరుకున్నారు. రాముడికి నైవేద్యంగా రేగిపండ్లు తీసుకొచ్చారు. వీటిని రామ జన్మభూమి ట్రస్టుకు అందించారు.