సమగ్ర కుల గణన ద్వారా జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. శనివారం నగరంలోని 29వ డివిజన్ పరిధిలో జరుగుతున్న సమగ్ర కుల గణన సర్వేను మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ కులగణనను పారదర్శకంగా చేపట్టాలని ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని సూచించారు.