అయోధ్య రాముని ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించినా ఏపీలో మాత్రం 22న పాఠశాలలు పునః ప్రారంభించడం దారుణమన్నారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఉద్దేశంతో సెలవులు పొడిగించినట్టే అయోధ్య రాముడి ప్రతిష్ఠ రోజున కూడా సెలవు ప్రకటించాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.