విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలంలోని తామరాపల్లి గ్రామంలో శుక్రవారం మృతదేహం లభ్యమైనట్టు సమాచారం రావడంతో ఎస్.కోట సీఐ షణ్ముఖ రావుతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి చూడగా సుమారు వారం రోజుల కిందట మృతి చెందిన మహిళ శరీరం, గుర్తించడానికి వీలు లేకుండా పడి ఉందని తెలిపారు. మృత దేహం వద్ద గోనె సంచులు, ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయని, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రోజూ కొండకు వస్తున్న పశువుల కాపర్లు, చీపురుపుల్లలు సేకరించేవారి నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలిపారు. ఎస్.కోట నుంచి వైద్యులను రప్పించి ఘటనా స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.