భార్యపై హత్యాయత్నం చేసిన భర్త కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.13 వేలు జరిమాన విధిస్తు న్యాయాధికారి కె.సత్యకుమారి శుక్రవారం తీర్పు నిచ్చారు. టంగుటూరు కు చెందిన ఇండ్ల నవీన్ భార్యను రోకలిబండ బాది హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు 2017 జనవరిలో కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన న్యాయాధికారి నిందితుడు నవీన్‌పై నేరారోపణ రుజువు కావడంతో ఐదేళ్లు జైలు, జరిమాన విధించారు. ప్రాసిక్యూషన్ తరుపున అదనపు పీపీ మో రబోయిన పద్మజ తన వాదనలు వినిపించారు.