ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మి కుల కు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని యూటీ ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలుపుతూ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల పిల్లల భవిష్యత కోసం పొదుపు చేసుకున్న వేలాది కోట్ల రూపాయలను ఏళ్ల తరబడి విడుదల చేయకపోవడంతో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదరుకొంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు సుధాకర్‌నాయుడు, ఉపాధ్యక్షురాలు హేమ లత, జిల్లా కార్యదర్శులు పురంవెంకటరమణ, భాస్కర్‌రెడ్డి, ఆదినారా యణ, డివిజన కన్వీనర్ ఎంగవీటి సుధాకర్, రవిప్రకాష్, రెహ్మాన, బివిరమణ, నాయకులు శ్రీనివాసులు, అంజాద్, గంగులప్ప, సీనప్పా, సురేంద్ర, శ్రీలత, భార్గవి,వెంకటయ్య, ఉత్తన్న రవీంద్ర, వెంకటరమ ణారెడ్డి, అజ్మతుల్లా, భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.