ఒక్క చాన్స అంటూ మీ ముందుకు వచ్చారు. మనవాడే కదా అంటూ 2019 ఎన్నికల్లో కడపలో అన్ని సీట్లు గెలిపించారు. ఇప్పటికీ మీ పరిస్థితి ఏమైనా మారిందా.. మీకు ఉద్యోగాలు వచ్చాయా.. రైతుల జీవితంలో మార్పు వచ్చిందా.. కడపలో ఎవరికైనా న్యాయం జరిగిందా.. ఒకరు జగనమోహన రెడ్డి, రెండు మీ ఎంపీ రెడ్డికి న్యాయం జరిగింది. ఒక్క సాగునీటివ ప్రాజెక్టు అయినా తెచ్చారా... కడపకు స్టీలు ఫ్యాక్టరీ వచ్చిందా.. రైతులకు డ్రిప్ ఇచ్చాడా.. ఇవ్వలేదు. మాటలు కోటలు దాటుతాయి. చేతలు మాత్రం గడప దాటవు.. అదీ జగనమోహనరెడ్డి నైజం. తమ్ముళ్లూ కమలాపురం సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నా.. ఈ జనసందోహం ఉందంటే ఇక ఏ మాత్రం అనుమానమే లేదు. ఈసారి పులివెందుల టీడీపీదే’’ అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చెప్పారు.