జగన ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని చంద్రబాబు మాత్రమే పూర్చగలరని మాజీ ఎమ్మెల్పీ బీటెక్ రవి అన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడపలో కటింగ్‌బాషా, దావత బాషాగా పేరు తెచ్చుకున్నారన్నారు. జగనరెడ్డి ఒకటిన్నర సంవత్సరంలో తన సొంత ఆస్తి అయిన భారతి సిమెంటును నిర్మించుకున్నారని అది ఆయనకు సొంత ఆస్తులపై ఉన్న మమకారం అన్నారు. అధికారం చేపట్టి ఐదేళ్లు కావస్తున్నా స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదంటూ మండిపడ్డారు.