రాబోయే ఎన్నికలలో వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పాడాలని తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జ్ శంకర్‌యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బి.కొత్తకోట నగర పంచాయతీలో జయహో బీసీ సదస్సు అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహి రంగ సభలో శంకర్‌యాదవ్ మాట్లాడుతూ తన హయాంలో రూ.2వేల కోట్లతో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. అయితే తంబళ్లపల్లెలో ఇప్పటి ఎమ్మెల్యే ఇసుక తవ్వకాలు, గ్రానైట్ రవాణాతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 1000 ఎకరాలు అక్రమ పద్ధతిలో బినామీల పేర్లతో సమీకరించారని ఆరోపించారు. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కబ్జా చేసిన భూములను తిరిగి పేద రైతులకు ఇచ్చేయాలన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందని రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..ఎప్పుడెప్పుడు వైసీపీని ఇంటికి పంపుదామా.. అని జనం ఎదురుచూస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్త లకు తాను ఎల్లపుడు అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. బీసీలు అందరూ కలసి కట్టుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవండి. పార్టీ మీకు అండగా ఉంటుందని శంకర్ యాదవ్ పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన తాజ్ మాట్లాడుతూ...బీసీలకు ఎపుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుదన్నారు. తంబళ్లపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరం కలసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుడుం శ్రీనివాసులు, మండల పార్టీ కన్వీనర్లు నారాయణ స్వామిరెడ్డి ఆనందరెడ్డి, జిట్లా వెంకట్రమణ, పాలగిరి సిదఽ్ధ, మండల ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎండీ మస్తాన, సుకుమార్, సురేంద్ర, రావమాంజి, కుడుము శంకర్, రంజిత, మొటుకు శివ, జనసేన నాయకులు పోతుల సాయినాథ్, చింతల కిరణ్, నాగరాజు, మాన్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.