పుంగనూరు నియోజకవర్గం సోమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న లోహిత ఎంఎంఎంఎస్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు హెచ్ఎం నాగరాజు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థినికి ప్రతి ఏటా రూ. 12000 ఇంటర్ వరకు ఉపకార వేతనం అందుతుందన్నారు. దీంతో విద్యార్థినికి పాఠశాల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు