కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాసురావు(కోడికత్తి శ్రీను)కు బెయిల్ రాకుండా చేసి, తల్లిదండ్రులకు అతనిని దూరం చేసి దళిత కుటుం బాన్ని ముఖ్యమంత్రి జగన్ క్షోభ పెడుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తన అభిమాని శ్రీను కోడి కత్తితో చిన్న గాయం చేస్తే తనపై ఏకంగా హత్యాయత్నం చేశారని, విష ప్రయోగం జరిగిందని, తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని, తనను చంపడానికి చంద్రబాబే కుట్రలు పన్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఆ కేసును పట్టించుకోలేదు. బాధితుడిగా ఉన్న జగన్ కోర్టుకు వచ్చి డిక్ల రేషన్ ఇస్తే శ్రీనుకు బెయిల్ వస్తుందని కోర్టు చెప్పింది. శ్రీను తల్లిదండ్రులు వేడుకున్నారు. అయినా దళిత యువకుడికి బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఇదే నా దళితులపై జగన్‌కు ఉన్న ప్రేమ’’ అని ఎమ్మెల్యే గద్దె ప్రశ్నించారు.