జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8,430 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 34 కేంద్రాల్లో వెన్నెలవలస జేవీకే పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 30 కేంద్రాలు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, వీరఘట్టంలో రెండేసి కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ఒరిజినల్ గుర్తింపు కార్డు(ఆధార్) ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. గుర్తింపుకార్డుతోపాటు హాల్‌టిక్కెట్, ప్యాడ్, నీలం, నలుపు రంగు పెన్నులు విద్యార్థులు తీసుకెళ్లాలి.