భారత వాయుసేనలో అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సెట్కూరు సీఈవో పీవీ రమణ శుక్రవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, డిప్లమా పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుంచి ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఏ్ట్టఞట:// ్చజుఽజీఞ్చ్టజిఠ్చిడఠ.ఛిఛ్చీఛి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామ న్నారు. విద్యార్హత సైన్స్ విభాగాల ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఎంపీసీ 50 శాతం మార్కులతో లేదా మెకానికల్, ఎలక్ర్టికల్స్, ఎలక్ర్టానిక్స్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ర్స్టుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెసి లిజషన్‌తో 50 శాతం మార్కులతో 3 సంవత్సరాల డిప్లమా కోర్సు చేసి ఉండా లన్నారు. అలాగే సైన్స్ కాకుండా ఇతర విభాగాల ఉద్యోగా లకు 50 శాతం మా ర్కులతో ఇంటర్మీడియట్ లేదా సీవోబీఎస్‌ఈ ద్వారా గుర్తింపు పొందిన శిక్షణా సంస్థలలో 50శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సు అయి ఉండాల న్నారు. వయస్సు 17 సంవత్సరాల 6 నెలల నుంచి 21 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 17 తర్వాత ఆన్‌లైన్‌లో అర్హత పరీక్ష నిర్వహిస్తామని, తదుపరి విద్యా ర్హత ధృవపత్రాల పరిశీలన పూర్తయిన యెడల శారీరకధారుఢ్య పరీక్షలలో భాగంగా 1.6 కి ప రుగు పందెం పురుష అభ్యర్థులు 7 నిమిషాలలో, మహిళా అభ్యర్థులు 8 నిమిషాలలో, పుషఫ్స్ మొదలగునవి పూర్తి చేయాలన్నారు.