జగనన్న హౌసింగ్ కాలనీల్లో అవినీతే అవినీతి. రూ.15లక్షలకి ఎకరా భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.50కోట్లుకి అమ్మారు. కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ మాయమయ్యాయి. రూ.4500కోట్ల విలువ చేసే సిలికాని ఈ దుర్మార్గులు దోచేశారు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. కేజీఎఫ్ త్రీగా మార్చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి నిరాహారదీక్షకి దిగి పోరాటం చేశారు. అది ప్రజా సంపద, ప్రజలందరి కోసం వినియోగించాలి. జగన్ 45లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టాడు. ఇసుకంతా దోచేశారు. మొన్న బీచ్ శ్యాండ్‌ను అమ్మాలని చూస్తే, కోర్టు ఆపింది. జగన్‌కు ఓడిపోతామనే భయం పట్టుకుంది. ప్రజలు గెలవాలి. జగన్ పోవాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.