ఆధునిక విధానాలతో పాటు ఆయుష్ వైద్యవిధానాన్ని కూడా వినియోగిస్తున్న సమగ్ర విధానం వైపు దేశం పయనిస్తోందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ శనివారం అన్నారు. భవిష్యత్తులో ఆయుష్ నిపుణుల కోసం మానవ వనరుల అభివృద్ధి కోసం మొట్టమొదటిసారిగా రూపొందించిన కేంద్రం ‘ఆయుష్ దీక్ష’కు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఆయుర్వేద పరిశోధనా సంస్థ క్యాంపస్‌లో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు.గత 10 ఏళ్లలో ఆయుష్ ఉద్యమం "చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది" అని సోనోవాల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వైద్య రబీనారాయణ ఆచార్య ఇతర మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, విద్యార్థులు మరియు ఆయుష్ నిపుణులు పాల్గొన్నారు.