2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ముఖ్యమైన రాజకీయ పరిణామంలో, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి రాజీనామా చేసిన హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ శనివారం బిజెపిలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ తన్వర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హర్యానా ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ నయాబ్ సింగ్ సైనీ కూడా పాల్గొన్నారు.భారత రాజకీయాల్లో మరింత పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని తన్వర్ అన్నారు. హర్యానా రాష్ట్రం, భారత్ మరియు దాని ప్రజల అభ్యున్నతి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తన్వర్ చెప్పారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాతో టికెట్ పంపిణీపై విభేదాలు రావడంతో 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిర్సా మాజీ ఎంపీ కాంగ్రెస్‌ను వీడారు.