చంద్రన్న పాలన తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పి తెదేపాను గెలిపించాలని తెలుగుమహిళ కార్యదర్శి కడియం అనూరాధ కోరారు.
మునగపాక వెంకటాపురంలో మండల తెదేపా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోశనివారం ఇంటింటికీ వెళ్లి బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు.