ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసులకు భయపడాల్సిన అవసరం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 01:20 PM

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కోనసీమ జిల్లాకు చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇద్దరు మంత్రులతో సహా వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై నిప్పులు చెరిగారు. అయన మాట్లాడుతూ.... ఇళ్ల పట్టాల పేరుతో రూ.20 లక్షలు కూడా విలువచేయని భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేయించారు. రౌడీయిజం చేస్తున్నారు...కాలేరు గ్రామంలో ఐదుగురు దళితుల యువకులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయించారు. ఇద్దరు సర్పంచ్‌లపై కేసులు పెట్టారు.రేపు మీకూ ఇదే గతి తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఒక్క కేసు పెడితే 100 కేసులు పెట్టే సత్తా టీడీపీ, జనసేనకు ఉంది. ప్రశాంతతకు మారు పేరైన మండపేటలో మళ్లీ వేగుళ్ల జోగేశ్వరరావునే ఎమ్మెల్యే గా గెలిపించాలి అని పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com