సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర ముగిసింది. వైయస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రభంజనంలా సాగింది. స్థానికులతో పాటు ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్ బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తొలుత పాదయాత్ర జరిగింది. బైక్ ర్యాలీతో పాటు సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమైనది. అనంతరం అంబేడ్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు.