తాను గద్దెనెక్కడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగట్టగల నాయకుడు చంద్రబాబని... కుటుంబాల్ని సైతం ఆయన విడగొట్టి సొంత అన్నపై చెల్లెల్ని ఉసిగొల్పే నీచ సంస్కృతి ఆయనదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. వైయస్ఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం తపిస్తున్న సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని గద్దె దింపడానికి కాంగ్రెస్, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారనీ... అందులో భాగస్వామి కావడం సరికాదని షర్మిలకు హితవుపలికారు.