రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిరోడ్డున సీఎం వైయస్ జగన్ నెలకొల్పారని, అదే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేవలం హడావుడి చేసి మోసగించారని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. స్వాతం్రత్యానంతరం ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, వారెవ్వరి హయాంలో అమలు కాని సామాజిక సాధికారత జగన్ మాత్రమే చేసి చూపించారన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించేందుకు రూ. 45 వేల కోట్లు, వివిధ పథకాల రూపంలో పేదల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 2.34 లక్షల కోట్లు జమచేశారని తెలిపారు.