అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన దివ్యముహూర్తంలో పుట్టిన బిడ్డలకు చాలా మంది మగబిడ్డలకు రామ్ అని, ఆడపిల్లలకు సీత అని పేర్లు పెట్టుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఫర్జానా అనే ముస్లిం మహిళ తన శిశువుకు రామ్ రహీం అని పేరు పెట్టుకున్నారు. చాలా మంది తమ బిడ్డలకు రామ్ అని లేదా ఆ పేరును సూచించే రాఘవ్, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర లాంటి పేర్లు పెట్టుకున్నారు.