మహాత్మా గాంధీ వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ పోరాటం వల్ల బ్రిటిషర్లు మన దేశాన్ని వదిలేసి వెళ్లిపోయారన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో నేతాజీ 127వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం పెద్దగా ప్రభావం చూపలేదన్నారు. నేతాజీ లేకుంటే 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చేది కాదన్నారు.