కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
గువహటిలో అసోం పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో రాహుల్ గాంధీ భద్రత వైఫల్యం ఎదుర్కొన్నారు. రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటున్న ఇతరులకు భద్రతా విషయంపై అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు.