ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని గురువారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. 27వ తేదీన భీమిలి వేదికగా క్యాడర్‌తో సీఎం మహాసభ నిర్వహిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని పేర్కొన్నారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని చెప్పారు.