ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు హల్వా వేడుక నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం హల్వా వేడుక నిర్వహించారు. ఈ హల్వా వేడుక బడ్జెట్ ఖరారైందని, దాని ప్రింటింగ్ వర్క్ ప్రారంభమైందని సూచిస్తుంది.
ఈ వేడుకలో బడ్జెట్ తయారు చేసిన అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. బడ్జెట్ను రూపొందించే పనిలో నిమగ్నమైన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులందరూ బడ్జెట్ను సమర్పించే వరకు వారి కుటుంబాలను సంప్రదించడానికి వీలు లేదు.