ఛాయా సోమేశ్వరుడిని కోవెల విశేషమేమిటంటే గర్బగుడిలో శివలింగము వెనుక వున్న గోడపై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకేలా ఒక నీడ కనిపిస్తుంది. అదెక్కడి నుంచి పడుతుందో కూడా నేటికీ ఒక మిస్టరీయే.
అది ఒక స్తంభం నీడలా కనిపించినా ఆలయంలోని 8 స్తంభాల్లో అది దేని నీడ అనేది నేటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ నీడను మన చేతితో తాకితే మన చేయి కనిపించకపోవటం విశేషం. వెయ్యేళ్ల దండయాత్రల తర్వాత కూడా ఈ ఛాయా సోమేశ్వరాలయం అదే శోభతో నిలవటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa