75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని లిఖించిన వారి స్ఫూర్తిని నింపుకుని మన ప్రజాస్వామ్యం మరింత పరిడవిల్లాలలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గవర్నర్ అన్నారు. సవాళ్లు ఎదురైనా రాష్ట్రం వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తోందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వరాజ్య మైదానంలో 206 అడుగుల ఎత్తైన సమతా మూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని అవిష్కరించుకున్నామన్నారు. 56 నెలల్లో మన ప్రభుత్వం గ్రామ స్థాయి వరకూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చిందని అబ్దుల్ నజీర్ కొనియాడారు.