టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్లోని అక్కిన మునికోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మునికోటేశ్వరరావు కుటుంబం ఆదరణగా నిలిచింది. దాదాపు 53 రోజుల పాటు మునికోటేశ్వరరావు నివాసంలోనే భువనేశ్వరి, బ్రాహ్మణిలు ఉన్నారు. కష్ట సమయంలో తమకు మద్దతుగా ఉన్న మునికోటేశ్వరరావు కుటుంబసభ్యులను భువనేశ్వరి కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. భువనేశ్వరి రాకతో మునికోటేశ్వరరావు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.