సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమా నతలు, వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఏలూరు జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి అన్నారు. గిరిజన భవన్‌లో బేటీ బచావో – బేటీ పడావో ఆడపిల్లలను బతికి ద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం వర్క్‌షాపును ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ సామాజిక భద్రత, బాల్య వివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ఏర్పాటుచేసిన బోర్డులను ఆవిష్కరిం చారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ పీడీ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీఈవో శ్యామ్‌సుందర్, బాలల సంరక్షణ అధికారి సీహెచ్.సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.