సీఎం జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నాయకులకు రావాలని ఉన్నా స్థానిక మంత్రి కారణంగా భయపడుతున్నారన్నారు. వైసీపీకి అభ్యర్థులు లేరని, స్థానిక మంత్రికి కూడా టిక్కెట్ వస్తుందో లేదో తెలియదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని తెలిపారు.