సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో నేను మండపేట నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చాక దళిత నేతలొచ్చి నన్ను కలిశారు. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలను మెయిన్ రోడ్డుమీదకు తీసుకురావాలని ఎన్నాళ్లుగానో తాము పోరాడుతున్నామని చెప్పారు. ఇందుకు పెత్తందార్ల అడ్డంకులే కారణమని చెప్పగానే.. నేను తక్షణమే స్పందించడం జరిగింది అని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. అయన మాట్లాడుతూ.... సామాజిక న్యాయ పరిపాలనకు సారథిగా దమ్మున్న నాయకుని పరిపాలనలో దళిత నాయకుల కోరికను నేను నెరవేర్చాలనుకున్నాను. భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి ఇన్నాళ్లైనా ఇంకా కొనసాగుతున్న కులవివక్షను నిర్మూలించాలనే ఉద్దేశంతో .. మున్సిపాల్టీలో తీర్మానం చేసి మరీ ఆ మహానుభావుల విగ్రహాల్ని నగర నడిబోడ్డుకి తెచ్చి నిలబెట్టు కోగలిగాం. బాధాకరమైన విషయమేమంటే, మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా స్వయంగా కౌన్సిల్ సమావేశానికి నేను హాజరై తీర్మానం చేయించే సమయంలో పెత్తందార్ల ప్రవర్తన చాలా విడ్డూరంగా నిలిచింది. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ మహనీయుల విగ్రహాలకు ప్రధాన కూడలిలో స్థలం ఇవ్వడానికి అంగీకరించని ఆ పెత్తందార్లు కౌన్సిల్‌లో ఆ మహనీయుల గురించి నాలుగు మాటలు మాట్లాడటానికీ సిద్ధపడలేదు. అయినప్పటికీ, దళితుల పక్షాన నిలిచిన ప్రభుత్వంలో వారు కోరినట్లు ఈరోజుకు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలు మండపేట నడిబొడ్డుకు చేరడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.