జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక నెల రోజుల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ రాష్ట్రంలో మరో కొత్త మోసానికి జగన్ తెర తీశారన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష ఎప్పడు నిర్వహిస్తారు..? ఎప్పుడు పోస్టులు భర్తీ చేస్తారు..? అని ప్రశ్నించారు. ఎన్నికలు సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలరా..? ఎందుకు ఈ ఒట్టి వాగ్దానాలు..? అని గంటా నిలదీశారు. ఇలా నిరుద్యోగులను ఎన్ని రోజులని మభ్యపెడతారని ప్రశ్నించారు. ఒక ప్రణాళిక లేకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారన్నారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు కాకా మరేమిటని జగన్‌ను గంటా నిలదీశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదని..భవిష్యత్తు మనదేనన్నారు. రేపు అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం ౼ జనసేన ప్రభుత్వమే రాబోతోందన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులన్నీ భర్తీ చేసి, మీ ఉద్యోగాలను మీకు ఇచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని గంటా తెలిపారు.