గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశీ వ్యక్తి ఉన్న ఓ నౌకపై హౌతీ రెబెల్స్ దాడి చేశారు. ఎంవీ మార్లిన్ లువాండా అనే వ్యాపార నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు యాంటీ షిప్ క్షిపణిని ప్రయోగించారు. క్షిపణి దాడితో దెబ్బతిన్న వాణిజ్య నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. క్షిపణి దాడి తర్వాత ఈ నౌక నుంచి అత్యవసర సందేశం పంపబడింది.గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లోనే మోహరించి ఉన్న భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక ఈ సందేశాన్ని అందుకుని వెంటనే రంగంలోకి దిగింది. క్షిపణి దాడితో వాణిజ్య నౌకపై అగ్నిప్రమాదం సంభవించగా, ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకా సిబ్బంది ఆ మంటలను సకాలంలో ఆర్పివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa