పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాల మూడవసారి జాతీయ స్థాయి హరిత పాఠశాల అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా సోమవారం నేషనల్ గ్రీన్ క్రాప్స్ జిల్లా సమన్వయకర్త బాల చైతన్య పాఠశాలను సందర్శించి గ్రీన్ మాస్టర్ వెంకట సిద్ధులు, డివిజనల్ కన్వీనర్ రాజేంద్ర, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్ఎం శ్రీవాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.