ఆరోపణలు చేసి పారిపోయే పిరికిపంద చంద్రబాబు అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నెల్లూరులో నేషనల్ హైవేను ఆనుకుని రా...కదలిరా సభను నిర్వహించారు. చూసిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, నెల్లూరు జిల్లా చంద్రబాబు గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో అర్ధమైందన్నారు. చంద్రబాబు మాత్రం నాకు ఏక పక్షంగా ఉంది..నా బలం పెరిగింది..నాకు ఓట్లు పెరిగాయి అని చెప్పుకుంటున్నారు. ఆయన కొడుకేమో నేను రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నాను అంటున్నాడు. ముందు రెడ్ బుక్కులో రాసుకోవాల్సింది చంద్రబాబు పేరు అంటూ ఎద్దేవా చేశారు.