దళితులను గుండెల్లో పెట్టుకున్న పార్టీ వైయస్ఆర్సీపీ అని తిరుపతి వైయస్ఆర్సీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి ఉద్ఘాటించారు. నా సోదరుడు ఆదిమూలం పార్టీపైన, పార్టీలోని పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. వైయస్ఆర్సీపీలో ఎస్సీలకు గౌరవం లేదు అని ఆదిమూలం అన్నారు. నేను సూటిగా చెప్తున్నా..స్వాతంత్య్రం వచ్చి ఇప్పటి వరకూ ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేలా చూసుకున్నది ఒక వైయస్ఆర్సీపీ పార్టీ, ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు.