విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం వచ్చింది. ఆలయంలో నిర్వహించిన హుండీల కానుకల లెక్కింపు కార్యక్రమంలో 20 రోజులకు రూ.2,99,68,935లు నగదు రూపంలో సమకూరాయి. 640 గ్రాముల బంగారం, 5 కిలోల 610 గ్రాముల వెండి వచ్చాయి. యూఎస్‌ఏ డాలర్లు 542, 1.5 ఓమన్ రియాల్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 100 కెనడా డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 20 యూరోలు, 35 సింగపూర్ డాలర్లు, 1మలేషియా రింగెట్, 105 యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్, 0.5 కువైట్ దినార్, 11 సౌదీ రియాల్స్, 20 న్యూజిలాండ్ డాలర్లు, 100 సౌతాఫ్రికా ర్యాండ్‌లు, 55 ఖతార్ రియాల్స్‌తో పాటు హంగ్‌కాంగ్ డాలర్లు కూడా లభించాయి.
మరోవైపు ఆన్‌లైన్ ఈ హుండీ ద్వారా రూ.67,230 కానుకలు వచ్చాయి. హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామారావు, పాలక మండలి సభ్యులు, దేవదాయ శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పర్యవేక్షించారు. ప్రతి రోజూ విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.. భక్తులు హుండీల్లో బంగారం, వెండితో పాటుగా విదేశీ కరెన్సీను కూడా తమనకు తోచిన విధంగా సమర్పిస్తారు. అంతేకాదు భక్తులు ఆన్‌లైన్ ద్వారా ఈ హుండీలో కూడా కానుకలు సమర్పిస్తుంటారు.. వీటిని లెక్కిస్తుంటారు.