నల్లమాడ మండలం నుంచి కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా కర్ణాటక కు రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని ఓ గ్రామంలో రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ చేసి ఇక్కడి నుంచి కర్ణాటకకు తరలిస్తూ పలుమార్లు తండ్రీ, కుమారులు పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గురువారం ఉదయం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa