గత తెదేపా ప్రభుత్వ కాలంలో నూతన భవనంలోకి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిని మార్చారు. 30 నుంచి 50 పడకలు పెంచారు. రోజూ సగటున 30 మంది ఇన్ పేషెంట్లు వస్తున్నారు. కొంతకాలంగా నిధులు సరిపోక నిర్వహణ సక్రమంగా లేదు. గురువారం వార్డులోని పరుపులు చిరిగిపోయినా అలాగే వినియోగిస్తున్నారు. ప్రతి పరుపు మీద రోజు దుప్పటి ఉండాలి. ఇక్కడ అస్సలు పరుపుల మీద దుప్పట్లు కనిపించడం లేదు. అధికారులు కూడా పట్టి పట్టనట్లుగా ఉన్నారు.