మహారాష్ట్ర సమీపంలోని దహను జిల్లాలోని ఘెల్వాడ అనే చిన్న తీర గ్రామం చికూ పండ్లకు ప్రసిద్ధి. ఈ చికూ పండ్లు అంటే ఏవో అనుకోకండి మనం తినే సపోటా పండ్లే.
ఈ పండ్లను నగరీకరణ పేరుతో కనుమరగు అవ్వకుండా కాపాడాలని ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. స్థానిక రైతులు ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 10వ చికూ ఫెస్టివల్ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో బోర్డ్ బీచ్ తీరాన ఘనంగా జరుగనుంది.