మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ ఫామ్ హౌజ్లో రెండు కుక్కలు నివసిస్తున్నాయి. అందులో ఓ కుక్క ఆహార పదార్థాలు అనుకొని పేలుడు పదార్థాలను నోటితో పట్టుకొచ్చింది.
ఆ తర్వాత దాన్ని కొరకగా పేలిపోయింది. ఆ కుక్క కూడా చనిపోయింది. ఫామ్ హౌజ్ వద్ద ఉన్న వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.