సీఎం రాజీనామా చేస్తే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శూన్యత ఏర్పడకూడదని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. జార్ఖండ్ సీఎం అరెస్టుపై ఆయన రాజ్యసభలో మాట్లాడారు.
తదుపరి చర్యలు చేపట్టే వరకు ఆయన్నే సీఎంగా కొనసాగించాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గడిచిన 20 గంటల నుంచి జార్ఖండ్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం జార్ఖండ్‌లో ప్రభుత్వం ఉండాలని ఆయన పేర్కొన్నారు.